311 vacancies in APSRTC: District-wise vacancy details in Vijayawada Zone.ఏపీఎస్ఆర్టీసీ ఇటీవల అప్రెంటిస్ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా విజయవాడ జోన్ పరిధిలో 311 ఖాళీలను భర్తీ చేయనుంది.
APSRTC Apprentice Recruitment 2024 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC), విజయవాడ జోన్ పరిధిలో పలు ట్రేడుల్లో అప్రెంటిస్ (Apprenticeship) శిక్షణకు సంబంధించి 311 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలకు ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లయ్ చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబర్ 20వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అర్హులైన అభ్యర్థులకు విజయవాడలోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి ఎంపిక చేయనున్నారు. అప్రెంటిస్ అభ్యర్థుల ఎంపికలు ఐటీఐ మార్కులు, సీనియారిటీ ప్రకారం ఉంటుంది.
అభ్యర్థులు పూర్తి వివరాలకు వెబ్సైట్ చూడొచ్చు. అలాగే.. అప్లయ్ చేసుకోవడానికి లింక్ ఇదే.. క్లిక్ చేయండి.
APSRTC District-wise vacancy details ఖాళీల వివరాలు:
Details | Number of Vacancies |
Total Vacancies | 311 |
District-wise Vacancies | |
కృష్ణా | 41 |
ఎన్టీఆర్ | 99 |
గుంటూరు | 45 |
బాపట్ల | 26 |
పల్నాడు | 45 |
ఏలూరు | 24 |
పశ్చిమగోదావరి | 31 |
Districts in Vijayawada Zone | Krishna, NTR, Guntur, Bapatla, Palnadu, Eluru, West Godavari |
Trades | Diesel Mechanic, Motor Mechanic, Electrician, Welder, Painter, Fitter, Machinist, Draftsman Civil డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్మెన్ సివిల్ టేడ్రుల్లో ఈ ఖాళీలు ఉన్నాయి |
Qualification, Fee Detailsఇతర ముఖ్య సమాచారం :
- అర్హత: దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
- ఎంపిక విధానం: విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల అధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు: రూ.118 చెల్లించాల్సి ఉంటుంది.
- దరఖాస్తు విధానం : ఆన్లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన లింకులు
అధికారిక నోటిఫికేషన్ | ఇక్కడ క్లిక్ చేయండి |
ఆధికారిక వెబ్సైట్ | వెబ్సైట్ సందర్శించండి |