6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్‌లో – ఫిజికల్ టెస్ట్‌లపై స్పష్టత | 6,100 Constable Jobs in Andhra Pradesh – Clarity on Physical Tests

6,100 Constable Jobs in Andhra Pradesh : 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్‌లో – ఫిజికల్ టెస్ట్‌లపై స్పష్టత..ఆంధ్రప్రదేశ్‌లో నిలిచిపోయిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను పునఃప్రారంభించనున్నారు. ఈ క్రమంలో APSLPRB (ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు) చర్యలు తీసుకుంటోంది. వివరాల్లోకి వెళ్తే:

AP Police Constable PET PMT Tests:

ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (APSLPRB) నిలిచిపోయిన కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియను పునఃప్రారంభించేందుకు చర్యలు చేపడుతోంది. తాజాగా ఇన్‌ఛార్జ్ చైర్మన్ ఆకే రవికృష్ణ ఈ విషయంపై స్పష్టతనిచ్చారు, ఈ ఏడాది డిసెంబరు చివరి వారంలో ఫిజికల్ టెస్ట్‌లు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వంలో 2022లో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. గత ఏడాది జనవరిలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా 4,59,182 మంది హాజరై, వారిలో 95,208 మంది అర్హత సాధించారు.

ఈ అర్హత సాధించిన వారిలో 91,507 మంది మాత్రమే ఫిజికల్ టెస్ట్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఫిజికల్ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులకు మరో అవకాశం ఇస్తున్నట్లు APSLPRB చైర్మన్ ప్రకటించారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 3గంటల నుండి 21వ తేదీ సాయంత్రం 5గంటల వరకు http://slrb.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ పరీక్ష అనంతరం వివిధ కారణాల వలన నియామక ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిలిచిపోయిన నియామక ప్రక్రియను పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటోంది.

ప్రిలిమ్స్ రాత పరీక్షలో 95,208 మంది అర్హత:

కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం గతేడాది జనవరి 22న ప్రిలిమ్స్ రాత పరీక్ష నిర్వహించగా 4,58,219 మంది హాజరయ్యారు, వారిలో 95,208 మంది అర్హత సాధించారు. ఫిబ్రవరి 5న ఫలితాలు విడుదలయ్యాయి. తదుపరి దశలో దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలు (పీఎంటీ, పీఈటీ) నిర్వహించాల్సి ఉంది. మార్చి 13 నుండి 20 వరకు ఈ పరీక్షలు నిర్వహించడానికి షెడ్యూల్ విడుదల చేసి హాల్‌టికెట్లు జారీ చేశారు. అయితే, MLC ఎన్నికలు జరుగుతుండడంతో పరీక్షలు వాయిదా వేశారు. ప్రస్తుతం NDA ప్రభుత్వం ఈ పరీక్షలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంది.

ఇక్కడే వివాదం ప్రారంభమైంది:

ఈ పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లో సివిల్ హోం గార్డులకు 15%, APSP హోం గార్డులకు 25% రిజర్వేషన్ ఇవ్వడంతో వివాదం చెలరేగింది. కొంత మంది కోర్టును ఆశ్రయించగా, నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మార్పు చోటు చేసుకుంది, కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కానిస్టేబుల్ నియామకాలను పూర్తి చేసేందుకు, న్యాయ నిపుణుల సాయం తీసుకొని న్యాయ సమస్యలను పరిష్కరించి 6,100 కానిస్టేబుల్ నియామకాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.

Join Telugu Government Jobs Whats App Group

Join Telugu Government Jobs Telegram channel

రైల్వే శాఖలో 41,500 ఉద్యోగాల నోటిఫికేషన్ – పరీక్ష తేదీల మార్పులు, కొత్త షెడ్యూల్ విడుదల

Leave a Comment