తెలంగాణ ప్రభుత్వ సంస్థలో 153 జూనియర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. అర్హతలు, విభాగాల వారీగా ఖాళీల వివరాలివే

nmdc job recruitment 2024 telangana Hyderabad 153 junior officer jobs

తెలంగాణ రాష్ట్రం – హైదరాబాద్‌ (Hyderabad) మసాబ్‌ట్యాంక్‌లోని నేషనల్‌ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NMDC).. ఖాళీగా ఉన్న జూనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 153 జూనియర్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు. నవంబర్‌ 10 దరఖాస్తులకు చివరితేది. అలాగే.. అభ్యర్థులు పూర్తి వివరాలను సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ https://www.nmdc.co.in/ చూడొచ్చు.

మొత్తం జూనియర్ ఆఫీసర్ (ట్రైనీ) పోస్టులు: 153

SNO POSTCATEGORYNUMBER OF POSTS
1జూనియర్ ఆఫీసర్ (ట్రైనీ)కమర్షియల్04
2జూనియర్ ఆఫీసర్ (ట్రైనీ)ఎన్విరాన్‌మెంట్01
3జూనియర్ ఆఫీసర్ (ట్రైనీ)జియో అండ్ క్వాలిటీ కంట్రోల్03
4జూనియర్ ఆఫీసర్ (ట్రైనీ)మైనింగ్‌56
5జూనియర్ ఆఫీసర్ (ట్రైనీ)సర్వే09
6జూనియర్ ఆఫీసర్ (ట్రైనీ)కెమికల్04
7జూనియర్ ఆఫీసర్ (ట్రైనీ)సివిల్09
8జూనియర్ ఆఫీసర్ (ట్రైనీ)ఎలక్ర్టికల్‌44
9జూనియర్ ఆఫీసర్ (ట్రైనీ)ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్03
10జూనియర్ ఆఫీసర్ (ట్రైనీ)మెకానికల్20

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, సీఏ/ఐసీఎంఏ, డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ (ఎంబీఏ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఇతర సమాచారం :

  • వయోపరిమితి: 32 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
  • స్టైపెండ్: నెలకు రూ.37,000- రూ.1,30,000 వరకు ఉంటుంది.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి.
  • దరఖాస్తు ఫీజు: రూ.250.. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
  • ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్‌ 10, 2024.

మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment