RRB Exam Dates 2025: రైల్వే శాఖలో 41,500 ఖాళీల కోసం RRB ప్రకటన విడుదలైంది. ఎగ్జామ్ తేదీలు మరియు పూర్తి వివరాలను తెలుసుకోండి.
RRB Revised Exam Calendar: ఇటీవల రైల్వే శాఖ వివిధ ఉద్యోగాలకు అనేక నోటిఫికేషన్లను జారీ చేసింది. కానీ పరీక్ష తేదీలను అప్పటి నోటిఫికేషన్‌లో వెల్లడించలేదు. ప్రస్తుతం ఆయా పోస్టుల రాత పరీక్ష తేదీలను స్పష్టంగా ప్రకటిస్తూ, పరీక్షల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్లలో జరుగనున్న ఈ పరీక్షలకు సంబంధించి గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ను మారుస్తూ, కొత్త షెడ్యూల్‌ను RRB వెల్లడించింది.
తాజా ప్రకటన ప్రకారం, ఆర్పీఎఫ్ ఎస్ఐ, టెక్నీషియన్, జేఈ పోస్టుల రాత పరీక్షలు నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో నిర్వహించనున్నారు. పరీక్షకు 10 రోజులు ముందు ఎగ్జామ్ సిటీ, తేదీ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందిస్తారు. నాలుగు రోజుల ముందుగానే అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. పరీక్షకు హాజరు కాబోయే అభ్యర్థులు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా తనిఖీ చేయబడతారు కాబట్టి, పరీక్షా కేంద్రానికి ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకురావడం తప్పనిసరి.
RRB Exam Dates:
పోస్టు పేరు | రాత పరీక్ష తేదీలు |
అసిస్టెంట్ లోకో పైలట్ (CBT-1) | నవంబర్ 25 – నవంబర్ 29, 2024 |
ఆర్పీఎఫ్ ఎస్ఐ (RPF SI) | డిసెంబర్ 02 – డిసెంబర్ 12, 2024 |
టెక్నీషియన్ | డిసెంబర్ 18 – డిసెంబర్ 29, 2024 |
జూనియర్ ఇంజినీర్ | డిసెంబర్ 13 – డిసెంబర్ 17, 2024 |
RRB Exam Dates

ఖాళీలు Vacancies : దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో మొత్తం 41,500 ఖాళీల భర్తీకి పరీక్షలు జరుగుతాయి, వీటిలో
పోస్టు పేరు | పోస్టుల సంఖ్య |
అసిస్టెంట్ లోకో పైలట్ | 18,799 |
ఆర్పీఎఫ్ ఎస్ఐ | 452 |
టెక్నీషియన్ | 14,298 |
జూనియర్ ఇంజినీర్ | 7,951 |

