RRB NTPC Admit Card 2025 : RRB NTPC 2025 పరీక్ష తేదీల కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ పరీక్షల షెడ్యూల్‌ను Railway Recruitment Board త్వరలో విడుదల చేయనుంది.
రైల్వేలో ఉద్యోగావకాశాలు
భారత రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) రిక్రూట్‌మెంట్ ద్వారా 11,558 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో 8,113 గ్రాడ్యుయేట్ స్థాయి ఉద్యోగాలు, 3,445 అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులు ఉన్నాయి. ఈ ఖాళీలకు సంబంధించిన పరీక్ష తేదీలు, అడ్మిట్ కార్డ్ విడుదల త్వరలో జరగనున్నట్లు సమాచారం.
RRB NTPC 2025: అధికారిక ప్రకటనకు ఎదురుచూపు
ఈ పరీక్షల తేదీలు త్వరలో రైల్వే అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెల్లడించనున్నారు. అభ్యర్థులు తమ సంబంధిత ప్రాంతీయ RRB వెబ్‌సైట్‌లను సందర్శించి షెడ్యూల్ చెక్ చేసుకోవచ్చు.
RRB NTPC Admit Card 2025 :
ఈ 11,558 ఖాళీలు దేశవ్యాప్తంగా 21 రీజియన్లలో భర్తీ చేయనున్నారు. ఇవి:
అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్‌పుర్, జమ్ము & శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం.
RRB NTPC 2025 Exam Pattern
ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఇంటర్ మరియు డిగ్రీ స్థాయి పరీక్షలకు సిలబస్ ఒకేలా ఉంటుంది. అయితే, ప్రశ్నల కఠినతలో తేడా ఉంటుంది. డిగ్రీ స్థాయి పరీక్షల ప్రశ్నలు కొంచెం కఠినంగా ఉంటాయి.
ఉద్యోగ వివరణ
• గ్రాడ్యుయేట్ పోస్టులు: స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్, సీనియర్ క్లర్క్.
• అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు: కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్ క్లర్క్, ట్రైన్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్.
Salary Details
• లెవెల్-3 ఉద్యోగాలు: రూ. 21,700 మూల వేతనం (మొత్తం సుమారు రూ. 40,000).
• లెవెల్-2 ఉద్యోగాలు: రూ. 19,900 మూల వేతనం (మొత్తం సుమారు రూ. 36,000).
Official Website
ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్ష తేదీలను రైల్వే త్వరలో ప్రకటించనుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.rrbapply.gov.in ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

