25000 జీతంతో తెలంగాణలో DCCB బ్యాంకు లో ఉద్యోగాలు TGCAB DCCB Recruitment 2024

TGCAB DCCB Recruitment 2024 : తెలంగాణ స్టేట్ కోపరేటివ్ బ్యాంక్ నుంచి  కొత్తగా ఉద్యోగ ప్రకటన వెలువడింది  ఈ ఉద్యోగ నోటిఫికేషన్ లో భాగంగా కోపరేటివ్ ఇంటర్న్స్  పోస్టులను భర్తీ చేయనున్నారు.

WhatsApp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్ (TGCAB).. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఇంటర్న్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఈ ప్రకటన ద్వారా 10 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్త గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్‌ 30 ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ https://tscab.org/ చూడొచ్చు. అప్లికేషన్‌ ఫామ్‌ లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి.

TGCAB DCCB Recruitment 2024

మొత్తం ఖాళీల సంఖ్య: 10

తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్‌ బ్యాంక్‌ (టీజీసీఏబీ): 01

డిస్ట్రిక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ (డీసీసీబీ): 09

ఇతర ముఖ్యమైన సమాచారం :

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ (మార్కెటింగ్/ కోఆపరేటివ్/ అగ్రి బిజినెస్/ రూరల్ డెవలప్‌మెంట్), పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం: నెలకు రూ.25,000 వరకు వేతనం ఉంటుంది.

పని ప్రదేశాలు: ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్‌, మెదక్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, షార్ట్‌లిస్ట్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ది డిప్యూటీ జనరల్ మేనేజర్, హ్యుమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్, ది తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ట్రూప్ బజార్, హైదరాబాద్’ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్‌ 30, 2024

అప్లికేషన్‌ ఫామ్‌ లింక్‌ : క్లిక్‌ చేయండి.

Also Read : Balmer Lawrie రిక్రూట్‌మెంట్ 2024: 19 ఖాళీలు ఆన్లైన్ లో అప్లై చేయండి (Last date 6 Dec 2024)